Telugu Global
Cinema & Entertainment

Kalyanam Kamaneeyam: సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి

Kalyanam Kamaneeyam: కల్యాణం కమనీయం అనే సినిమాను కుటుంబమంతా కలిసి చూడొచ్చు. ఈ విషయాన్ని స్వయంగా సెన్సార్ సభ్యులు చెబుతున్నారు.

Kalyanam Kamaneeyam: సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి
X

సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "కళ్యాణం కమనీయం". ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది.

పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల ఈ సినిమాను తీశాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. అంటే.. సకుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడొచ్చన్నమాట.

సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా వస్తోంది కళ్యాణం కమనీయం. కేవలం కంటెంట్ మీద నమ్మకంతో మేకర్స్ ఇంత సాహసం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది.

ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్. శ్రావణ్ భరధ్వాజ్ సంగీతం అందించాడు. సంపాదన లేని ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ.

First Published:  9 Jan 2023 5:30 AM GMT
Next Story