Telugu Global
Cinema & Entertainment

Devil | డెవిల్ నుంచి స్టన్నింగ్ పోస్టర్

Devil Movie - దసరా కానుకగా డెవిల్ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. కల్యాణ్ రామ్ స్టయిలిష్ లుక్ లో కనిపించాడు.

Devil | డెవిల్ నుంచి స్టన్నింగ్ పోస్టర్
X

నందమూరి కల్యాణ్‌రామ్‌ తాజా చిత్రం డెవిల్. ద బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. అభిషేక్‌ నామా నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన డెవిల్‌ టీజర్‌కి మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అంతా ఎదురుచూసేలా చేసింది. నవంబర్‌ 24న డెవిల్ విడుదలకానుంది.

దసరా సందర్భంగా అభిమానులను స్పెషల్‌ పోస్టర్‌తో విష్‌ చేశారు నందమూరి కల్యాణ్‌రామ్‌. డెవిల్ కొత్త పోస్టర్ లో డైనమిక్‌గా కనిపిస్తున్నాడు కల్యాణ్ రామ్. పార్టీకి రెడీ అయినట్టు స్పెషల్‌ టుక్సెడోలో ఉన్నాడు. సినిమా స్టయిలిష్ గా కూడా ఉంటుందనే విషయాన్ని ఈ పోస్టర్ తో చెప్పకనే చెప్పారు.

అభిషేక్‌ పిక్చర్స్ పేరు చెప్పగానే అందరికీ అత్యద్భుతమైన నిర్మాణ విలువలు కళ్ల ముందు మెదులుతాయి. డెవిల్‌లోనూ మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. శ్రీకాంత్‌ విస్సా రాసిన కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ స్పై థ్రిల్లర్ లో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

బింబిసార తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన కల్యాణ్ రామ్, డెవిల్ పై ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్ కు మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నాడు. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచింది డెవిల్.

First Published:  24 Oct 2023 4:55 PM GMT
Next Story