Telugu Global
Cinema & Entertainment

Amigos: కల్యాణ్ రామ్ నుంచి మరో లుక్

Amigos: కల్యాణ్ రామ్ కొత్త సినిమా ఎమిగోస్. ఈ సినిమా నుంచి కల్యాణ్ రామ్ కొత్త లుక్ ను రిలీజ్ చేశారు.

Amigos: కల్యాణ్ రామ్ నుంచి మరో లుక్
X

బింబిసార‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సత్తా చాటాడు క‌ళ్యాణ్ రామ్‌. ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ ముందుకొస్తున్నాడు. ఆ సినిమా పేరు 'అమిగోస్'. డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేంద్ర రెడ్డితో, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ రూపొందిస్తోన్నఈ చిత్రం టైటిల్ వినగానే అందరినీ ఆకట్టుకుంది. అమిగోస్ అంటే ఫ్రెండ్‌ను పిలిచే స్పానిష్ ప‌దం. రాజేంద‌ర్ రెడ్డి ఈ చిత్రంతో దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ పోస్ట‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా అమిగోస్ మూవీ నుంచి నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ లుక్ మ‌రో పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఆయ‌న మీసాలు తిప్పుకుని స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. త‌న పాత్ర పేరు సిద్ధార్థ్. దానిపై మ‌నిషిని పోలిన మ‌నిషి అని అర్థం వ‌చ్చేలా డోప‌ల్ గ్యాంగ‌ర్ అని రాశారు. దానికి వెనుక అస‌లు విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందేంటున్నారు మేకర్స్.

క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 'అమిగోస్' నిర్మాణం ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌తోనూ టీమ్ బిజీగా ఉంది. ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ గా విడుద‌ల చేస్తారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  2 Jan 2023 7:30 AM GMT
Next Story