Telugu Global
Cinema & Entertainment

Devil Movie | డెవిల్ మరోసారి వస్తున్నాడు

Kalyan Ram - కల్యాణ్ రామ్ తాజా చిత్రం డెవిల్. ఈ సినిమా త్వరలోనే ఈటీవీలో ప్రసారం అవుతుంది.

Devil Movie | డెవిల్ మరోసారి వస్తున్నాడు
X

కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా డెవిల్. గతేడాది బాక్సాఫీస్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చిన సినిమా ఇదే. అయితే ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన డెవిల్ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అక్కడ కూడా దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడీ సినిమా బుల్లితెరపైకి రాబోతోంది.

డెవిల్ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ దక్కించుకుంది. ఈ సినిమాను మార్చి 10, ఆదివారం, సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయాలని నిర్ణయించింది. నిజానికి ఈ పాటికే ఈ సినిమా టీవీల్లోకి రావాలి. కానీ డీల్ సెట్ అవ్వడానికి కాస్త టైమ్ పట్టింది.

అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సెకెండ్ హీరోయిన్ గా మాళవిక నాయర్ నటించింది. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందించాడు. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన డెవిల్ సినిమా, బుల్లితెరపై ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

First Published:  19 Feb 2024 3:34 PM GMT
Next Story