Telugu Global
Cinema & Entertainment

Devil Release Date | కల్యాణ్ రామ్ సినిమా వచ్చేస్తోంది

Devil Movie - కల్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్. ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి రెడీ అయింది ఈ మూవీ.

Devil Release Date | కల్యాణ్ రామ్ సినిమా వచ్చేస్తోంది
X

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ఇప్పటి వరకు విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరుతెన్నులు, డెవిల్ పాత్రలో తను ఒదిగిపోయిన విధానం, లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ లుక్ కి కూడా చాలా మంచి స్పందన వచ్చింది.

ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ చేయనటువంటి జోనర్ మూవీ.. భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. దీంతో సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్నారు.

‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు. గ‌త ఏడాది తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిన ‘బింబిసార’తో మెప్పించిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది ‘డెవిల్’తో మెప్పించటానికి రెడీ అవుతున్నారు.

అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందించారు.

First Published:  8 Dec 2023 3:49 PM GMT
Next Story