Telugu Global
Cinema & Entertainment

Devil Movie - డెవిల్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Kalyan Ram's Devil Movie - డెవిల్ మూవీ శరవేగంగా రెడీ అవుతోంది. ప్రస్తుతం స్టేటస్ ఏంటో చూద్దాం..

Devil Movie - డెవిల్ మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

డిఫరెంట్ మూవీస్, రోల్స్ చేస్తూ హీరోగా తనదైన‌ రూటులో దూసుకుపోతున్నాడు కళ్యాణ్ రామ్. ఆయన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ ఫైన‌ల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీక‌రిస్తున్నారు. 500 మందితో ఈ ఫైట్‌ను భారీగా తెర‌కెక్కిస్తున్నారు. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ యాక్ష‌న్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా దీన్ని ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ ఆధ్వ‌ర్యంలో డిజైన్ చేశారు.

స్వతంత్ర ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. దీంతో పాటు తాజాగా మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకు డిఫరెంట్ స్టోరీ అందించడమే కాకుండా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా సమకూరుస్తున్నాడు.

హర్షవర్థన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే టీజర్ ను విడుదల చేసి, అందులో రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తారు. అమిగోస్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ నుంచి రాబోతున్న సినిమా ఇదే.

First Published:  31 March 2023 2:18 PM GMT
Next Story