Telugu Global
Cinema & Entertainment

Devil | కల్యాణ్ రామ్ సినిమాకు రిలీజ్ డేట్ లాక్

Kalyan Ram's Devil Movie - ఈ ఏడాది మరోసారి థియేటర్లలోకి రాబోతున్నాడు కల్యాణ్ రామ్. అతడు నటించిన డెవిల్ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Devil | కల్యాణ్ రామ్ సినిమాకు రిలీజ్ డేట్ లాక్
X

వైవిధ్య‌మైన సినిమాల‌ు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా గ్లింప్స్‌లో హీరో పాత్ర తీరుతెన్నులు, డెవిల్ పాత్రలో హీరో ఒదిగిపోయిన విధానం చూపించారు. ఆ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో న‌వంబ‌ర్ 24న ఈ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.

‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా క‌ళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. టీజర్ చూస్తుంటే, సినిమా కచ్చితంగా కొత్తగా ఉండేలా ఉంది.

గ‌తేడాది ‘బింబిసార’తో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత అతడు చేసిన అమిగోస్ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో ‘డెవిల్’తో మెప్పించటానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్‌గా డెవిల్ హిందీ వెర్ష‌న్‌ గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేయ‌గా అది వైర‌ల్ అయ్యింది. సంయుక్తా మీన‌న్ ఇందులో హీరోయిన్.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ అందించాడు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  6 Aug 2023 3:27 PM GMT
Next Story