Telugu Global
Cinema & Entertainment

Bimbisara: బుల్లితెరపైకి బింబిసారుడు

Bimbisara: కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ బింబిసార. ఇప్పుడీ సినిమా బుల్లితెర వీక్షకుల్ని అలరించబోతోంది. ఈ వీకెండ్ జీ తెలుగులో ప్రసారం అవుతుంది.

Bimbisara: బుల్లితెరపైకి బింబిసారుడు
X

బింబిసారతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కల్యాణ్ రామ్. ఈ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇది. వశిష్ఠను దర్శకుడిగా పరిచయం చేస్తూ, కల్యాణ్ రామ్ చేసిన ఈ సినిమాను పెద్ద రిస్క్ గా చెబుతారు విశ్లేషకులు. అలాంటి రిస్కీ ప్రాజెక్టుతో సక్సెస్ కొట్టి శభాష్ అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్.

వెండితెరపై కాసులవర్షం కురిపించిన ఈ సినిమా, ఇప్పుడు బుల్లితెరపై అలరించడానికి సిద్ధమైంది. జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. జనవరి 8వ తేదీ సాయంత్రం బింబిసార సినిమాను తమ ఛానెల్ లో ప్రసారం చేయబోతోంది.

సంయుక్త మీనన్, కేథరిన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా కల్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రం బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

First Published:  2 Jan 2023 6:30 AM GMT
Next Story