Telugu Global
Cinema & Entertainment

Amigos Movie: కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం

Kalyan Ram's Amigos Movie Teaser review: అమిగోస్ అనే సినిమా చేశాడు కల్యాణ్ రామ్. ఈ హీరో కెరీర్ లో ఇదో ప్రయోగం. టీజర్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది.

Amigos Movie: కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం
X

వైవిధ్యమైన సినిమాలు, పాత్రలు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నాడు కల్యాణ్ రామ్. రీసెంట్ గా బింబిసార వంటి డిఫ‌రెంట్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన క‌ళ్యాణ్ రామ్ ఇప్పుడు అమిగోస్ అంటూ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ‘అమిగోస్‌’ అనే సినిమాతో ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ ఇవ్వబోతున్నాడు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ గా విడుద‌లవుతుంది. రాజేందర్ రెడ్డి దర్శకుడిగా పరియమౌతున్న ఈ సినిమా, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో ఉంది.

మ‌రోవైపు సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ కూడా ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగా ‘అమిగోస్‌’ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరాయి.

ఇప్ప‌టివ‌ర‌కు తాను చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా ‘అమిగోస్‌’ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ త్రిపాత్రాభిన‌యం చేశాడు. ఔత్సాహిక వ్యాపారవేత్తగా, సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా, కిల్లర్ గా కనిపించాడు. ఓ క‌ళ్యాణ్ రామ్ పాత్ర‌ను మ‌రో క‌ళ్యాణ్ రామ్ చంపాల‌నుకోవ‌టం.. దాని చుట్టూ జ‌రిగే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌.. మూడు పాత్ర‌లు ఒక చోట క‌లుసుకోవ‌టం.. లాంటివి టీజర్ లో ఆసక్తికరంగా ఉన్నాయి.

అస‌లు ఒకేలా ఉన్న ఆ ముగ్గురు ఎవ‌రు? అన్న‌ద‌మ్ములా.. స్నేహితులా .. అస‌లు ఒక‌రినొక‌రు ఎందుకు చంపుకోవాల‌నుకుంటున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని టీజర్ రేకెత్తించింది.

క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా.. త‌మ్మిరాజు ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్నారు.



First Published:  8 Jan 2023 1:04 PM GMT
Next Story