Telugu Global
Cinema & Entertainment

Amigos: కల్యాణ్ రామ్ సినిమా టీజర్ రిలీజ్ డేట్

Kalyan Ram: అమిగోస్ సినిమా నుంచి కల్యాణ్ రామ్ కు చెందిన 3 లుక్స్ వచ్చేశాయి. ఇప్పుడు టీజర్ వంతు.

Amigos: కల్యాణ్ రామ్ సినిమా టీజర్ రిలీజ్ డేట్
X

బింబిసార‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాడు క‌ళ్యాణ్ రామ్‌. ఇప్పుడు మ‌రో డిఫ‌రెంట్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకొస్తున్నాడు. ఆ సినిమా పేరు ‘అమిగోస్’. డెబ్యూ డైరెక్ట‌ర్ రాజేందర్ రెడ్డితో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ సినిమా చేస్తున్నాడు కల్యాణ్ రామ్.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. రీసెంట్‌గానే రెండు లుక్స్ విడదల చేశారు. ఓ లుక్‌లో మెలివేసిన మీసాలతో స్టైలిష్ లుక్‌లో కనిపించే వ్యాపారవేత్త సిద్ధార్థ్ పాత్ర అది. తర్వాత మంజునాథ్ అనే అమాయకమైన లుక్ లో కనిపించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్ర.

ఈ రెండు లుక్స్‌కి ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి చాలా మంచి రియాక్షన్ వచ్చింది. తాజాగా మూడో లుక్‌ను విడుదల చేశారు. గత రెండు లుక్స్‌తో పోల్చితే ఈ లుక్ మరింత స్టైలిష్‌గా ఉంది. కానీ ఈ పాత్రను అజ్ఞాత వ్యక్తి పాత్ర అని చెప్పారు. అసలు ఈ మూడు లుక్స్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 10న రిలీజ్ అయ్యే అమిగోస్ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు.

కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని మరింత పెంచుతూ, ఆదివారం టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ‘అమిగోస్’ సినిమాను ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ చేస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు

First Published:  6 Jan 2023 7:30 AM GMT
Next Story