Telugu Global
Cinema & Entertainment

Kalyan Ram | నా మాట తీసుకోండి.. రాసుకోండి

Kalyan Ram - డెవిల్ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు కల్యాణ్ రామ్. రాసి పెట్టుకోమని చెబుతున్నాడు.

Kalyan Ram | నా మాట తీసుకోండి.. రాసుకోండి
X

వైవిధ్య‌మైన సినిమాల‌ను చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయ‌న హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిన డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు కల్యాణ్ రామ్.

"మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియెన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని బింబిసార సమయంలో చెప్పాను. దాన్ని మీరు నిజం చేశారు. అదే కోవలో డెఫనెట్‌గా డెవిల్ మంచి కథ, కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌లో చూశారు. కథను తయారు చేసుకున్న శ్రీకాంత్, అద్బుతమైన విజువల్స్ అందించిన సౌందర్ రాజన్‌గారు, అలాగే వెంకట్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు, 1940 బ్యాక్ డ్రాప్ లో చేయాల్సిన ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేసిన గాంధీగారికి థాంక్స్."

డిసెంబర్ 29న డెవిల్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని.. సినిమా చాలా బాగుంటుందని, ఇది తన మాటగా తీసుకోవాలని, రాసుకోవాలని సూచించాడు కల్యాణ్ రామ్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో డెవిల్ సినిమా వస్తోందని.. అందరికీ తప్పకుండా నచ్చుతుందని అంటున్నాడు.

సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ కీలక పాత్ర పోషించింది. మర్డర్ మిస్టరీగా ఈ సినిమా తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

First Published:  12 Dec 2023 5:02 PM GMT
Next Story