Telugu Global
Cinema & Entertainment

Kalyan Ram's Amigos Movie: కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ అమిగోస్

Kalyan Ram's Amigos Movie: మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో అతడి లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. కళ్యాణ్ రామ్ తొలిసారిగా పొడవాటి జుట్టుతో గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమాలో అతడు త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.

Kalyan Ram Amigos Movie
X

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ అమిగోస్

బింబిసార వంటి బ్లాక్ బాస్టర్ విజయంతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని మాంచి జోరు మీద ఉన్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఒక సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రాజేందర్ రెడ్డి ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి తాజాగా అమిగోస్ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఇవాళ ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు.

కెరీర్ మొదలైనప్పటి నుంచి కళ్యాణ్ రామ్ ఒకే లుక్‌లో కనిపిస్తున్నాడంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రూట్ మార్చిన కళ్యాణ్ రామ్ ఇజం సినిమా నుంచి ఒక్కో సినిమాలో ఒక్కోలా కనిపిస్తున్నాడు. ఇక బింబిసారలో రాజుగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అమిగోస్ మూవీలో కూడా కళ్యాణ్ రామ్ కొత్తగా కనిపిస్తున్నాడు. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో అతడి లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. కళ్యాణ్ రామ్ తొలిసారిగా పొడవాటి జుట్టుతో గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఈ సినిమాలో అతడు త్రిపాత్రాభినయం చేస్తున్నాడు.

ఒకేలా కనిపించే వ్యక్తులు కలవడం వల్ల కలిగే పరిణామాలపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ తోపాటు రిలీజ్ డేట్‌ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023 ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌కు జోడీగా ఆషికా రంగనాథ్ నటిస్తోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార-2 ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

First Published:  7 Nov 2022 9:16 AM GMT
Next Story