Telugu Global
Cinema & Entertainment

Kalki | ప్రపంచంలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారంట!

Kalki Movie | కల్కి సినిమాపై మరోసారి స్పందించాడు హీరో రానా. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు.

Kalki | ప్రపంచంలో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారంట!
X

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా కథకు ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని అంటున్నాడు హీరో దగ్గుబాటి రానా. అలాంటి యూనివర్సల్ కథతో వస్తోందంట కల్కి.

"భారతీయ తెరపై తదుపరి పెద్ద మూవీ కల్కి. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు. చాలా కాలంగా, నేను మా వైపు నుండి ఎవెంజర్స్ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. అందులో భాగమైనందుకు నన్ను ఉత్తేజపరిచింది."

ఇలా కల్కి కథపై స్పందించాడు రానా. ఈ సినిమాను కామిక్ కాన్ లో ప్రచారం చేశాడు రానా. దీంతో కల్కిలో రానా కూడా కీలక పాత్ర పోషించాడని అంతా అనుకుంటున్నారు. దీనిపై రానా క్లారిటీ ఇచ్చాడు.

కల్కి సినిమాలో తను లేనని స్పష్టం చేశాడు ఈ దగ్గుబాటి హీరో. కేవలం కామిక్ కాన్ లో ప్రచారం కోసమే తను వెళ్లానని, అంతకుమించి ఈ ప్రాజెక్టుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు

అశ్వనీదత్ నిర్మాతగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది కల్కి సినిమా. ప్రభాస్ సరసన దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు.

First Published:  5 May 2024 4:15 PM GMT
Next Story