Telugu Global
Cinema & Entertainment

Kalki 2898 AD trailer | ముంబయిలో ట్రయిలర్ లాంచ్

Prabhas’ Kalki 2898 AD trailer: కల్కి ట్రయిలర్ లాంచ్ కు రంగం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ శుక్రవారం ట్రయిలర్ విడుదల చేస్తారు.

Kalki 2898 AD trailer | ముంబయిలో ట్రయిలర్ లాంచ్
X

ప్రభాస్, దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా ట్రయిలర్ రెడీ అయింది. ముంబయిలో లాంచ్ చేయాలని భావిస్తున్నారు. దీని కోసం బాహుబలి సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.

బాహుబలి-2 ట్రయిలర్ ను ముంబయిలో లాంచ్ చేశారు. కట్ చేస్తే, సినిమా పెద్ద హిట్టయింది. అందుకే కల్కి ట్రయిలర్ ను కూడా ముంబయిలోనే లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. పైగా అమితాబ్, దీపిక, దిశా లాంటి వాళ్లంతా ముంబయిలోనే అందుబాటులో ఉన్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. బుజ్జి అనే కారు చుట్టూ ఈ ప్రచారం నడుస్తోంది. ట్రయిలర్ రిలీజ్ తర్వాత మరో కొత్త ప్లానింగ్ తో ప్రచారం చేయబోతోంది యూనిట్.

ఈనెల 27న థియేటర్లలోకి రాబోతోంది కల్కి సినిమా. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  3 Jun 2024 5:03 PM GMT
Next Story