Telugu Global
Cinema & Entertainment

Kalki Movie | నాలుగో వారంలో కూడా అదే జోరు

Kalki Movie - కల్కి సినిమా దాదాపు 4 వారాలు పూర్తిచేసుకుంటోంది. ఇప్పటికీ ఈ సినిమా హవా తగ్గలేదు.

Kalki 2898 AD Movie Review: కల్కి 2898 ఏడీ- రివ్యూ! {3.25/5}
X

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా వరుసగా నాలుగో వారం కూడా తన జోరు కొనసాగిస్తోంది. అన్ని ఏరియాల్లో భాషతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అవ్వడంతో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా, బ్రేక్ ఈవెన్ అవ్వడంతో పాటు.. నిర్మాతలు, బయ్యర్లకు 150 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టింది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, విడుదలైన 27 రోజుల్లో ఈ సినిమా 285 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ వీకెండ్ కు ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది. ఇదే ఊపు కొనసాగితే, కల్కి సినిమా మరో అరుదైన రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది.

నైజాంలో ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ సాధించే దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు 90 కోట్ల రూపాయల మార్క్ దాటాయి. మరో 10 కోట్లు వసూళ్లు సాధిస్తే, నైజాంలో అత్యంత అరుదైన రికార్డ్ కల్కి పేరిట నమోదవుతుంది.

అటు ఉత్తరాంధ్ర, సీడెడ్ లో కూడా బయ్యర్లు పూర్తిగా రికవర్ అయ్యారు. ఈ సినిమాతో వైజయంతీ మూవీస్ మరోసారి తన ఘనత నిలుపుకుంది. భారీ బడ్జెట్ తో అత్యంత రిస్కీ మూవీ తీసి, పెద్ద హిట్ కొట్టింది.

First Published:  25 July 2024 4:54 AM GMT
Next Story