Telugu Global
Cinema & Entertainment

Kali | తెలుగుతెరపైకి మరో డిఫరెంట్ మూవీ

Kali Movie - ఇద్దరు హీరోలు, కానీ ఇద్దరూ హీరోలు కాదు. అలా అని విలన్లు కూడా కాదు. ఇదో డిఫరెంట్ స్టోరీ. తెలుగు తెరపై కొత్త ప్రయోగం.

Kali | తెలుగుతెరపైకి మరో డిఫరెంట్ మూవీ
X

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా కలి. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

ఈ సినిమాలో హీరోలు ఎవ్వరూ ఉండరంట. ఇప్పటివరకు తెలుగుతెరపైకి రాని సరికొత్త కథతో వస్తున్న ఈ సినిమాలో నేహా కృష్ణన్ హీరోయిన్ గా నటించింది. జీవన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 March 2024 4:57 AM GMT
Next Story