Telugu Global
Cinema & Entertainment

Satyabhama | కాజల్ హీరోయిన్ గా సత్యభామ, టీజర్ రిలీజ్

Kajal's Satyabhama - మొన్నటికిమొన్న భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కాజల్. ఇప్పుడు తనే లీడ్ రోల్ లో సత్యభామ అనే సినిమాను విడుదలకు సిద్ధం చేసింది.

Satyabhama | కాజల్ హీరోయిన్ గా సత్యభామ, టీజర్ రిలీజ్
X

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నాడు. అంతేకాదు, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. సుమన్ చిక్కాల దర్శకుడు.

క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా “సత్యభామ” సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

“సత్యభామ” టీజర్ విషయానికొస్తే.. హత్యకు గురైన ఓ యువతిని రక్షించే క్రమంలో ఆమె ప్రాణాలు కాపాడలేకపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. అప్పటి నుంచి ఆమె గిల్టీ ఫీలింగ్ తో బాధపడుతుంటుంది. ఉన్నతాధికారులు ఈ కేసు నుంచి సత్యను దూరంగా పెడతారు. అయితే సత్య మాత్రం వదలదు. అమాయకురాలైన యువతిని చంపిన హంతకుల వేట మొదలుపెడుతుంది.

ఈ వేటను మన ఇతిహాసాల్లో నరకాసుర వధ కోసం యుద్ధ రంగంలో అడుగుపెట్టిన సత్యభామ సాహసంతో పోల్చుతూ ప్లే అయ్యే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆకట్టుకుంది. ఈ కేసును క్లోజ్ చేసేది లేదన్న సత్యభామ... యువతి హత్యకు కారణమైన హంతకులను చట్టం ముందు నిలబెట్టిందా లేదా అనే అంశాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది.

ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. త్వరలోనే సత్యభామ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు.

First Published:  11 Nov 2023 1:36 PM GMT
Next Story