Telugu Global
Cinema & Entertainment

Kajal | భగవంత్ కేసరి సినిమాలో నవ్వించేది నేనే

Kajal - భగవంత్ కేసరి సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల్ని వివరించింది కాజల్. సినిమాలో కామెడీ పండించే బాధ్యతను తనే తీసుకుందంట.

Kajal | భగవంత్ కేసరి సినిమాలో నవ్వించేది నేనే
X

నందమూరి బాలకృష్ణ, అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోంది భగవంత్ కేసరి సినిమా. ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ఒకటి కాజల్ అగర్వాల్ రీఎంట్రీ. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు, ఈ మూవీలో కామెడీ పండించే బాధ్యత కూడా తనే తీసుకుంది.

"భగవంత్ కేసరి సినిమాలో మెయిన్ హ్యూమర్ వచ్చేది నేను పోషించిన కాత్యాయని పాత్ర నుంచే. నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ జానర్ కూడా అదే. అనీల్ రావిపూడి మార్క్ టిపికల్ కామెడీ నా క్యారెక్టర్ తో పండుతుంది. సెట్స్ లో నా పాత్రను బాగా ఎంజాయ్ చేశాను. బాలయ్యతో నా కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది."

ఇలా భగవంత్ కేసరి సినిమాలో తన పాత్ర చాలా సరదాగా ఉంటుందనే విషయాన్ని బయటపెట్టింది కాజల్ అగర్వాల్. తొలిసారి బాలకృష్ణతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ, బాలయ్య ఎనర్జీకి ఫిదా అయిపోయింది. సెట్స్ లో బాలయ్య ఉంటే చాలని, అన్ని పనులు ఆటోమేటిగ్గా అయిపోతాయని అంటోంది. ఇన్నాళ్లూ బాలయ్యతో నటించలేకపోయాననే బాధను కూడా వ్యక్తం చేసింది.

ఈ సినిమాలో బాలయ్యకు కూతురు వరస పాత్రలో నటించింది మరో హీరోయిన్ శ్రీలీల. ఆమె గురించి మాట్లాడుతూ.. పక్కా ప్లానింగ్ తో, భయంకరమైన హార్డ్ వర్క్ తో శ్రీలీల దూసుకుపోతోందని తెలిపింది. దసరా కానుకగా థియేటర్లలోకి వస్తోంది భగవంత్ కేసరి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

First Published:  13 Oct 2023 2:07 AM GMT
Next Story