Telugu Global
Cinema & Entertainment

Satyabhama | కాజల్ సినిమాకు డేట్ ఫిక్స్

Satyabhama - కాజల్ కొత్త సినిమా సత్యభామ. విడులకు సిద్ధమైన ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది కాజల్.

Satyabhama | కాజల్ సినిమాకు డేట్ ఫిక్స్
X

కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే 17న ఈ సినిమాను గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర, అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క ప్రజెంటర్ గా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించాడు. క్రైమ్ థ్రిల్లర్ కథతో వస్తున్న ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకుడు.

“సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం డిజైన్ చేసిన వీడియో క్రియేటివ్ గా ఉంది. క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడిభాగాలను లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా..అది క్యాలెండర్ లో మే 17 డేట్ ను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది. మే 17న “సత్యభామ” సినిమా రిలీజ్ ను ఇలా వినూత్నంగా అనౌన్స్ చేశారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించాడు.

షార్ట్ గ్యాప్ తర్వాత కాజల్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇంతకుముందు ఆమె బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో నటించింది. అందులో ఆమెకు పాత్రకు పెద్దగా ప్రశంసలు దక్కలేదు.

First Published:  22 April 2024 5:17 PM GMT
Next Story