Telugu Global
Cinema & Entertainment

Kajal Aggarwal - బాలయ్యతో జాయిన్ అయిన కాజల్

Kajal Aggarwal - ఎట్టకేలకు టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది కాజల్. బాలయ్య మూవీ సెట్స్ లో ఆమె ప్రత్యక్షమైంది.

Kajal Aggarwal - బాలయ్యతో జాయిన్ అయిన కాజల్
X

బాలకృష్ణ, అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టార్ శ్రీలీల కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ నెల ప్రారంభంలో సినిమా షూటింగ్‌లో జాయిన్ అయింది కూడా. ఈ మూవీలో బాలయ్య సరసన హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె హైదరాబాద్‌లో షూటింగ్‌లో జాయిన్ అయింది.

బాలకృష్ణతో కాజల్ నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. ఈ సందర్భంగా బాలకృష్ణ, కాజల్ ఒకరినినొకరు పిడికిలితో షేక్ హ్యాండ్స్ ఇస్తున్నట్లుగా కనిపిస్తున్న ఫోటోని మేకర్స్ షేర్ చేశారు.

ఈ సినిమాలో బాలకృష్ణ, మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో ఆయనది డిఫరెంట్ లుక్‌. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో పాటు, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.

బాలకృష్ణ గత రెండు సినిమాలకు సంగీతం అందించిన తమన్, ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు.

First Published:  21 March 2023 3:09 AM GMT
Next Story