Telugu Global
Cinema & Entertainment

Kajal Agarwal | మొన్న శృతిహాసన్.. ఈరోజు కాజల్ అగర్వాల్

Kajal Aggarwal - కాజల్ అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

Kajal Agarwal | మొన్న శృతిహాసన్.. ఈరోజు కాజల్ అగర్వాల్
X

మొన్నటికిమొన్న శృతిహాసన్ కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఓ అగంతకుడు ఆమెను చాలా దూరం ఫాలో అయ్యాడు. వీడియో తీస్తూ వెంటపడ్డాడు. కట్ చేస్తే, దాదాపు అలాంటి అనుభవమే హీరోయిన్ కాజల్ కు కూడా ఎదురైంది.

ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరైంది కాజల్ అగర్వాల్. ఆమెతో ఫొటోలు దిగేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. అందులో ఓ వ్యక్తి కూడా కూడా ఉన్నాడు. ఉన్నట్టుండి సడెన్ గా కాజల్ దగ్గరకు వచ్చాడు. తనతో ఫొటో దిగడానికి అతడొచ్చాడని కాజల్ భావించింది.

కానీ హఠాత్తుగా ఆ వ్యక్తి, కాజల్ నడుము చుట్టూ చేయి వేశాడు. ఊహించని ఘటనతో కాజల్ బిత్తరపోయింది. ఏంటిది అంటూ కాస్త దూరంగా జరిగింది. ఆ వెంటనే ఆ వ్యక్తి అక్కడ్నుంచి మాయమయ్యాడు. క్షణాల్లో బౌన్సర్లు ప్రత్యక్షమయ్యారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.

సెక్యూరిటీ లేకుండా హీరోయిన్లు బయటకు రారు. ఒక్కోసారి సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. అందుకే హీరోయిన్లు పబ్లిక్ లోకి రావడానికి భయపడతారు.

First Published:  6 March 2024 5:23 PM GMT
Next Story