Telugu Global
Cinema & Entertainment

కబ్జా టీజర్.. మరో కేజీఎఫ్

ఉపేంద్ర హీరోగా నటించిన సినిమా కబ్జా. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. అచ్చం కేజీఎఫ్ సినిమాలా ఉంది.

కబ్జా టీజర్.. మరో కేజీఎఫ్
X

కేజీఎఫ్ సక్సెస్ తో కన్నడ నుంచి పాన్ ఇండియా అప్పీల్ తో చాలా సినిమాలొస్తున్నాయి. ఇప్పటికే సుదీప్, రక్షిత్ శెట్టి లాంటి వాళ్లు ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఉపేంద్ర వంతు వచ్చింది. శాండిల్ వుడ్ లో సీనియర్ హీరోగా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర, ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమా రెడీ చేశాడు. అదే కబ్జా.

కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది కబ్జా సినిమా. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించగా, సుదీప్ ఓ కీలక పాత్ర పోషించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఆ టీజర్ చూస్తే అచ్చుగుద్దినట్టు కేజీఎఫ్ సినిమాలా ఉంది.

కేజీఎఫ్ సినిమాలో ఎలాంటి కలర్ స్కీమ్ వాడారో, ఆ సినిమాలో ఎలాంటి ఎలివేషన్లు వాడారో అచ్చుగుద్దినట్టు అదే పాట్రన్ లో ఉంది కబ్జా టీజర్. అంతేకాదు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా కేజీఎఫ్ ఛాయలు కనిపించాయి. అన్నింటికీమించి ఈ రెండు సినిమాల మధ్య ఇంకో ముఖ్యమైన పోలిక ఉంది.

కేజీఎఫ్ సినిమాలో ఓ గ్యాంగ్ స్టర్ కథను చెప్పారు. కబ్జాలో కూడా గ్యాంగ్ స్టర్ కథనే చెప్పారు. కేజీఎఫ్ తరహాలోనే కబ్జా కూడా పీరియాడిక్ మూవీనే. ఇలా అన్ని ఎలిమెంట్స్ తో కేజీఎఫ్ ను గుర్తుచేస్తూ వస్తున్న కబ్జా సినిమా, ఏ మేరకు ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



First Published:  19 Sep 2022 4:03 AM GMT
Next Story