Telugu Global
Cinema & Entertainment

సోషల్ మీడియాను ఊపేస్తున్న కబ్జా

ఉపేంద్ర హీరోగా నటిస్తున్న మూవీ కబ్జా. కిచ్చా సుదీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్, సోషల్ మీడియాను ఊపేస్తోంది.

సోషల్ మీడియాను ఊపేస్తున్న కబ్జా
X

కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా శ్రియా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం 'కబ్జా'. ఇందులో మరో స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఇద్ద‌రు స్టార్ హీరోల కాంబోతో వస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ పై అంచ‌నాలు పెరిగాయి.

పాన్ ఇండియా మూవీగా రాబోతున్న 'కబ్జా' ప‌లు భాష‌ల్లో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించి త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డ‌నుంది. అంతకంటే ముందే సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత పెంచేలా అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజ‌ర్ రిలీజైంది. రానా ద‌గ్గుబాటి చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ సూపర్ హిట్టయింది. ఇప్పటివరకు 25 మిలియన్ వ్యూస్‌ సాధించింది.

టీజ‌ర్‌లో ఉపేంద్ర ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించారు. చాలా రోజుల తర్వాత ఆయ‌న్ని అలాంటి పాత్ర‌లో చూస్తున్నారు ఫ్యాన్స్. కలర్ స్కీమ్, బ్యాగ్రౌండ్ స్కోర్, సీన్ టేకింగ్ డిఫరెంట్‌గా ఉంది. 1942 బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా ఇది. పవర్‌పుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నారు. ఉపేంద్ర యాక్ష‌న్ సీక్వెన్సెస్‌, ర‌వి బ‌స్రూర్ అందించిన గ్రిప్పింగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచ‌నాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి.

క‌న్న‌డ చిత్రసీమ‌లోని మ‌రో అగ్ర హీరో శివ‌రాజ్ కుమార్ కూడా స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌టం కొసమెరుపు. ఈ ముగ్గురి స్టార్స్‌కి చెందిన ఫ్యాన్స్‌కి ఇది కన్నులపండువగా ఉండ‌బోతోంది.

First Published:  21 Sep 2022 4:53 AM GMT
Next Story