Telugu Global
Cinema & Entertainment

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు గూస్‌బంప్స్‌ ఖాయం

‘వార్‌ 2’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు గూస్‌బంప్స్‌ ఖాయం
X

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు గూస్‌బంప్స్‌ ఇచ్చే క్యారెక్టర్‌లో తమ అభిమాన నటుడిని చూడబోతున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజాగా నటించనున్న ‘వార్‌ 2’ చిత్రంలో ఆయన పాత్రపై చిన్న క్లూ దొరికింది.

బాలీవుడ్‌ నటుడు హృతిక రోషన్‌తో కలిసి ‘వార్‌ 2’ చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం ఇప్పటికే క్లారిటీ వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ మల్టీస్టారర్‌ మూవీలో ఎన్టీఆర్‌ పాత్ర ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు దానిపై తాజాగా అందిన వార్త ఈ చిత్రంపై మరింత ఆసక్తి రేకెత్తించేలా చేస్తోంది.

‘వార్‌ 2’ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ భారతదేశానికి చెందిన రహస్య గూఢచారి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌లో త్వరలో ఎన్టీఆర్‌ పాల్గొంటారు.

ఇక యశ్‌ రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న చిత్రాల్లో ‘వార్‌ 2’ కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ చిత్రంలో రహస్య గూఢచారిగా నటించే ఎన్టీఆర్‌తో దీని తర్వాత ఇదే పాత్రతో ఒక ఫుల్‌ మూవీ తీయాలని, ఆ తర్వాత వచ్చే స్పై చిత్రాల్లో కూడా కీలక పాత్రల్లో ఎన్టీఆర్‌ని చూపించాలని ఆదిత్య చోప్రా భావిస్తున్నారట. అంటే జూనియర్‌ అభిమానులకు ఇది పండగ లాంటి వార్తే. ఇక ’వార్‌ 2’ వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుందని ఆ చిత్ర వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.

First Published:  6 March 2024 2:21 AM GMT
Next Story