Telugu Global
Cinema & Entertainment

వల్చర్స్ స్టంట్స్ అవార్డ్సు కి జవాన్, పఠాన్!

ఆస్కార్ అకాడెమీ స్టంట్స్ కేటగిరీలో అవార్డు లివ్వడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని న్యూయార్క్ మేగజైన్ వల్చర్స్ స్టంట్స్ అవార్డుల్ని గత సంవత్సరం ప్రారంభించింది.

వల్చర్స్ స్టంట్స్ అవార్డ్సు కి జవాన్, పఠాన్!
X

ఆస్కార్ అకాడెమీ స్టంట్స్ కేటగిరీలో అవార్డు లివ్వడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని న్యూయార్క్ మేగజైన్ వల్చర్స్ స్టంట్స్ అవార్డుల్ని గత సంవత్సరం ప్రారంభించింది. ఈ సంవత్సరం కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం హాలీవుడ్ మెగా యాక్షన్ మూవీస్ ‘జాన్ విక్ 4’, ‘మిషన్ ఇంపాసిబుల్ 7’ లతో బాటు షాటుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’, ‘పఠాన్’ రెండూ అవార్డులకినామినేట్ కావడం విశేష వార్తగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది.

2023 లో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్స్ ‘జవాన్’, ‘పఠాన్’ రెండూ రాబోయే స్టంట్స్ అవార్డ్స్ షోలో బహుళ నామినేషన్లని కూడా సంపాదించాయి. 2023 హాలీవుడ్ విడుదలలు కీనూ రీవ్స్ నటించిన ‘జాన్ విక్ 4’, టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాసిబుల్ 7’ లతో షారుఖ్ సినిమాలు పోటీపడడం ఫ్యాన్స్ కి పండుగలా మారింది.

‘జవాన్’, ‘పఠాన్’ రెండూ బెస్ట్ ఓవరాల్ యాక్షన్ మూవీ కేటగిరీలో నామినేషన్లు పొందాయి. ‘జవాన్’ బెస్ట్ స్టంట్, హైవే చేజ్ సీక్వెన్స్, బెస్ట్ వెహిక్యులర్ స్టంట్ కేటగిరీలలో కూడా నామినేషన్లు పొందింది. ‘పఠాన్’ జెట్‌ప్యాక్ ఫైట్ సీక్వెన్స్ తో బెస్ట్ ఏరియల్ స్టంట్‌ నామినేషన్ ని పొందింది. నామినేషన్ల పూర్తి జాబితా చూద్దాం :

బెస్ట్ స్టంట్: జవాన్ (హైవే చేజ్), జాన్ విక్: 4 (మెట్ల మీద ఫైట్), మిషన్: ఇంపాజిబుల్ 7 (బేస్ జంప్), ఈక్వలైజర్ 3 (స్టెయిన్డ్ గ్లాస్ సీలింగ్ దృశ్యం), ఎక్స్ ట్రాక్షన్ 2 (ఓపెనింగ్ యాక్షన్ సీను),

బెస్ట్ వెహిక్యులర్ స్టంట్: జవాన్ (హైవే చేజ్), జాన్ విక్: 4 (ది ఆర్క్ డి ట్రియోంఫ్ సీన్) మిషన్ ఇంపాజిబుల్ 7(రోమ్ కార్ చేజ్), ఫాస్ట్ X (రోమ్ కార్ చేజ్), ఫెరారీ (మిల్ మిగ్లియా రేస్)

బెస్ట్ ఏరియల్ స్టంట్: పఠాన్ (జెట్-ప్యాక్ ఫైట్), మిషన్ ఇంపాసిబుల్ 7 (బేస్ జంప్), ఎక్స్ ట్రాక్షన్ 2 (హెలికాప్టర్ షూట్ అవుట్), గాడ్జిల్లా మైనస్ వన్ (గాడ్జిల్లా చుట్టూ ఎగిరే విమానం), కాందహార్ (హెలికాప్టర్ ఫైట్)

బెస్ట్ ఓవరాల్ యాక్షన్ మూవీ: జవాన్, పఠాన్, జాన్ విక్: 4, మిషన్ ఇంపాసిబుల్ 7, ఎక్స్ ట్రాక్షన్ 2, గై రిచీస్ ది కోవెనెంట్, ఫిస్ట్ ఆఫ్ ది కాండోర్, సైలెంట్ నైట్, షిన్ కమెన్ రైడర్

వల్చర్స్ స్టంట్స్ అవార్డ్స్ గురించి :

న్యూయార్క్ మేగజైన్ సినిమా- సాంస్కృతిక విభాగపు వెబ్ సైట్ ‘వల్చర్’ గత సంవత్సరం మొట్టమొదటి స్టంట్స్ అవార్డ్సుని ప్రకటించింది. ‘వల్చర్’ వెబ్ సైట్ సినిమా విమర్శకుడు బిల్జ్ ఎబిరి 2019 లో రాసిన ‘ఇట్స్ టైమ్ ఫర్ ఏ బెస్ట్ స్టంట్స్ ఆస్కార్’ రిపోర్టు నుంచి ప్రేరణ పొంది స్థాపించిన ఈ అవార్డ్స్ కి - స్టంట్ నిపుణులు, దర్శకులు, వీఎఫ్ఎక్స్ సాంకేతికులు, ఛాయాగ్రహకులు, ఎడిటర్‌లు, యాక్షన్ జానర్‌లో పనిచేసే నిర్మాతలు మొదలైన వారితో కూడిన ఓటింగ్ అకాడమీని ఏర్పాటు చేసింది వల్చర్. పాత్రికేయులు, విమర్శకులు పోడ్‌కాస్టర్‌లు దీనిని కవర్ చేస్తారు. పది కేటగిరీలకి చెందిన నిపుణులు స్టంట్ వర్క్స్ లో అత్యుత్తమ ప్రతిభని గుర్తిస్తారు. కళాత్మకత -సాంకేతిక నైపుణ్యం రెండింటినీ పోషించిన నామినీలని ఎంపిక చేస్తారు. హేండ్ టు హేండ్ ఫైట్, షూట్-అవుట్‌లు, వెహిక్యులర్, ఏరియల్ యాక్షన్, బ్లాస్టింగ్స్ మొదలైన ఆస్కార్ అకాడెమీ గుర్తించని, సినిమా రంగంలో అతి ముఖ్యమైన క్రాఫ్ట్స్ ని వల్చర్ అవార్డ్స్ ద్వారా గుర్తించి ఆయా నిపుణుల్ని సత్కరిస్తారు.

ఎవరెవరు అర్హులు : యాక్షన్ మూవీలో బెస్ట్ స్టంట్స్, నాన్ యాక్షన్ మూవీలో బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఫైట్, బెస్ట్ షూట్ అవుట్, బెస్ట్ వెహిక్యులర్ స్టంట్స్, బెస్ట్ ఏరియల్ స్టంట్స్, బెస్ట్ ప్రాక్టికల్ బ్లాస్టింగ్స్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ మూవీ మొదలైన అన్ని కేటగిరీల్లో స్టంట్ కోఆర్డినేటర్, స్టంట్ కొరియోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్, యూనిట్ డైరెక్టర్ లేదా ఎవరైనా ప్రముఖ స్టంట్ ప్రొఫెషనల్స్ అవార్డ్సు కి అర్హులు.

2022 అవార్డుల విజేతలు : కమల్ హాసన్ ‘విక్రమ్’ కూడా!

యాక్షన్ మూవీలో బెస్ట్ స్టంట్: ఎథీనా, నాన్-యాక్షన్ మూవీలో బెస్ట్ స్టంట్: జాకాస్ ఫరెవర్, బెస్ట్ ఫైట్: యాక్సిడెంట్ మ్యాన్: హిట్‌మ్యాన్స్ హాలిడే, బెస్ట్ షూటౌట్: విక్రమ్, బెస్ట్ వెహిక్యులర్ స్టంట్: లాస్ట్ బుల్లెట్ 2, బెస్ట్ ప్రాక్టికల్ బ్లాస్టింగ్ : లాస్ట్ బుల్లెట్ 2 బెస్ట్ ఓవరాల్ యాక్షన్ మూవీ : టాప్ గన్: మావెరిక్.

ప్రస్తుత రెండవ వార్షిక స్టంట్స్ అవార్డుల విజేతల్ని మార్చి 4న ప్రకటిస్తారు. ఆసక్తి కలిగించే విషయమేమిటంటే, మిగతా కేటగిరీల్లో ఆస్కార్ అవార్డ్సు ని మార్చి 10 న ప్రకటిస్తారు. దీనికి ముందే స్టంట్స్ కేటగిరీలో మార్చి 4 న వల్చర్ స్టంట్స్ అవార్డ్సుని ప్రకటించడం!


First Published:  25 Jan 2024 9:02 AM GMT
Next Story