Telugu Global
Cinema & Entertainment

Jawan Movie | చరిత్ర సృష్టించిన షారూక్ సినిమా

Jawan Movie - షారూక్ హీరోగా నటించిన సినిమా జవాన్. మొదటి రోజు ఈ సినిమా చరిత్ర సృష్టించింది.

Jawan Movie | చరిత్ర సృష్టించిన షారూక్ సినిమా
X

కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘జవాన్’. అట్లీ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న హిందీ, త‌మిళ్, తెలుగులో విడుద‌లై బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జవాన్ సినిమా ఫస్ట్ డే రూ. 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి హిందీ చలన చిత్ర చరిత్రలో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేయటం విశేషం.

తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమంలో ఫస్ట్ డే కలెక్షన్స్‌కి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది ప్రొడక్షన్ హౌజ్. ‘ఇది ప్రారంభం మాత్రమే.. మీరు చూపించిన ఆశేషమైన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని అందరికీ ధన్యవాదాలను తెలియజేశారు.

అభిమానులు, సామాన్య ప్రేక్షకులతో పాటు సినిమాను చూసిన సెలబ్రిటీలు సైతం ‘జవాన్’ బాగుందని మెచ్చుకుంటున్నారు. షారూఖ్ మంచి ఫైర్ మీదున్నాడంటూ మహేష్ బాబు మెచ్చుకున్నాడు. తన రికార్డులను తానే బ్రేక్ చేస్తున్నాడని అన్నాడు.

ఇక దర్శకధీరుడు రాజమౌళి కూడా జవాన్ సినిమాను వీక్షించాడు. ఆయన కూడా తన స్పందనను తెలియజేశారు. ‘‘‘జవాన్’కి చాలా గొప్ప ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. అందుకనే షారూఖ్ ఖాన్‌ని బాక్సాఫీస్ బాద్ షా అని పిలుస్తారంటూ కొనియాడాడు.

షారూఖ్ ఖాన్ ఇంట్రడక్షన్ సీన్స్, వావ్ అనిపించే యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే మేకింగ్‌తో పాటు నయనతార గ్లామర్, పెర్ఫామెన్స్, విజయ్ సేతుపతి విలక్షణమైన విలనిజం.. దీపికా పదుకొనె వండర్ ఫుల్ యాక్టింగ్.. అనిరుద్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్ గా మారాయి.




First Published:  8 Sep 2023 4:47 PM GMT
Next Story