Telugu Global
Cinema & Entertainment

Jawaan Movie | మిషన్ ఇంపాజిబుల్ లో జవాన్

Jawaan Movie Trailer - మిషన్ ఇంపాజిబుల్ మూవీతో పాటు జవాన్ కూడా రెడీ అయ్యాడు. ట్రయిలర్ రాబోతోంది.

Jawaan Movie | మిషన్ ఇంపాజిబుల్ లో జవాన్
X

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్.. ‘పఠాన్’ సినిమాతో గట్టిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. వరల్డ్ వైడ్‌ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ రెడీ చేశాడు షారూక్. అదే ‘జవాన్’. ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.

ఈ నేప‌థ్యంలో ‘జవాన్’ ట్రైలర్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురావ‌టానికి మేక‌ర్స్ భారీ స‌న్నాహాలు చేస్తున్నారు. దీని కోసం ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాను సెలక్ట్ చేసుకున్నారు. త్వరలోనే థియేటర్స్‌లో రాబోతోంది మిషన్ ఇంపాజిబుల్ - డెడ్ రెకోనింగ్ పార్ట్-1. ఈ సినిమా ఇంటర్వెల్ టైమ్ లో జవాన్ ట్రయిలర్ ను ప్రదర్శించడానికి ఒప్పందం కుదిరింది.

టామ్ క్రూస్ సినిమాలకు వరల్డ్ వైడ్ ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాతో జవాన్ ట్రయిలర్ రావడం, ఇండియన్ ఆడియన్స్ కు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

ఈ సినిమా కోసం షారూక్ ఖాన్ ఎవ‌రూ ఊహించ‌ని స‌రికొత్త లుక్‌లోకి మారాడు. ఆ లుక్‌ చూసి ఆయ‌న అభిమానులు సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. దీంతో జ‌వాన్ మూవీ ట్రైల‌ర్‌ను చూడాల‌ని అంద‌రూ ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

షారూక్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

First Published:  4 July 2023 2:38 AM GMT
Next Story