Telugu Global
Cinema & Entertainment

Peddha Kapu-1 | జాతర సాంగ్ వచ్చేసింది

Peddha Kapu-1 - పెదకాపు సినిమా నుంచి మరో పాట రిలీజైంది. ఆశ్చర్యకరంగా ఇది కూడా ఆకట్టుకుంది.

Peddha Kapu-1 | జాతర సాంగ్ వచ్చేసింది
X

దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తీసిన రూరల్ పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ పెదకాపు-1. గ్రిప్పింగ్ ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలని పెంచాడు దర్శకుడు. ఫస్ట్ సింగిల్- రొమాంటిక్ మెలోడీ ఆల్రెడీ ట్రెండ్ అయింది. మ్యూజికల్ ప్రమోషన్‌లలో భాగంగా మేకర్స్ సెకెండ్ సింగిల్- జాతర పాటని విడుదల చేశారు.

మిక్కీ జె మేయర్ స్వరపరిచిన పాట భారీ డ్రమ్ సౌండ్‌లతో సాంప్రదాయ బీట్స్ తో ఆకట్టుకుంది. గుడి బ్యాక్ డ్రాప్ లో, సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వ్యక్తులతో జాతర వాతావరణం నిండుగా కనిపించింది. అనురాగ్ కులకర్ణి తన పవర్ ఫుల్ వాయిస్ తో మరింత ఉత్సాహాన్ని నింపాడు. కళ్యాణచక్రవర్తి త్రిపురనేని అద్భుతమైన సాహిత్యంతో అమ్మవారి పరాక్రమాన్ని వర్ణించాడు.

రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రఫీ విజువల్స్‌కు మరింత అందం జోడించింది. విరాట్ కర్ణ కొన్ని వండర్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ చేశాడు. పాటలో ఇంటెన్స్ గా కనిపించాడు. ఈ పాట కచ్చితంగా అన్ని జాతర ఉత్సవాల్లో ప్లే అవుతుంది.

విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, నాగబాబు, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, అనుసూయ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 29న విడుదలకు సిద్ధమైంది పెదకాపు-1.

Next Story