Telugu Global
Cinema & Entertainment

Jailer Movie | సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు తెలుగులో కూడా..!

Jailer Movie - రజనీకాంత్, తమన్న హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా జైలర్. ఈ సినిమా నుంచి తొలి తెలుగు లిరికల్ వీడియో రిలీజైంది. ఈ సాంగ్ ఆల్రెడీ తమిళ్ లో పెద్ద హిట్.

Jailer Movie | సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు తెలుగులో కూడా..!
X

సూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'జైలర్'. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జైలర్ ఫస్ట్ సింగిల్ 'కావాలయ్యా’ పాట తమిళ్ వెర్షన్ లో విడుదలై నేషనల్ వైడ్ గా వైరల్ అయింది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై టాప్ ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం రీల్స్ లో ఓ ఊపు ఊపుతోంది.

ఇప్పుడీ సాంగ్ తెలుగు వెర్షన్ ని విడుదల చేశారు మేకర్స్. అనిరుధ్‌ ఈ పాటని క్యాచి బీట్స్ తో ఇనిస్టెంట్ చార్ట్ బస్టర్ నెంబర్ గా కంపోజ్ చేశాడు. శ్రీ సాయి కిరణ్ తెలుగులో సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్‌ కలసి ఎనర్జిటిక్ గా పాడారు. ఈ పాటలో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్, శ్వాగ్, మెస్మరైజ్ చేయగా, తమన్నా తమ డాన్స్ తో అదరగొట్టింది.

ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటుల్ని తీసుకున్నారు. మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ రమ్యకృష్ణ, తమన్నాతో పాటు వసంత్ రవి, నాగబాబు, యోగిబాబు, జాఫర్ సాదిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. జైలర్ ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

First Published:  26 July 2023 1:29 PM GMT
Next Story