Telugu Global
Cinema & Entertainment

Adipurush - అద్భుతంగా వచ్చిన జై శ్రీరామ్ పాట

Adipurush Movie - టీజర్ నుంచి ఎట్రాక్ట్ చేస్తోంది జై శ్రీరామ్ టైటిల్ సాంగ్. ట్రయిలర్ లో అదే హైలెట్ గా నిలిచింది. ఇప్పుడా ఫుల్ సాంగ్ రిలీజైంది.

Adipurush: ఆదిపురుష్ కోసం విదేశాలకు ప్రభాస్
X

Adipurush: ఆదిపురుష్ కోసం విదేశాలకు ప్రభాస్

పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్‌. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది. గతంలో విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

ఇక తాజాగా ఈ చిత్రం నుంచి జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అనే గీతాన్ని విడుదల చేశారు. డివోషనల్ సాంగ్స్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న అజయ్ - అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాశాడు.

''జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.." అంటూ సాగే ఈ గీతాన్ని అద్భుతమైన ట్యూన్ తో స్వరపరిచారు అజయ్ - అతుల్ ద్వయం. ఒక్కో బీట్ హృదయాలు ఉప్పొంగేలా కనిపిస్తోంది. రావణుడితో యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో వచ్చే గీతంలా కనిపిస్తోందీ పాట.

రామ జోగయ్య శాస్త్రి రచన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే సాహిత్యంతో సింపుల్ గా ఉన్నా.. బలమైన పదజాలం కనిపిస్తోంది. 2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇది.



First Published:  20 May 2023 11:55 AM GMT
Next Story