Telugu Global
Cinema & Entertainment

Jagapathi Babu - మహేష్ మూవీకి విలన్ ఫిక్స్

Jagapathi Babu - మహేష్ నటిస్తున్న కొత్త సినిమాలో మెయిన్ విలన్ గా జగపతిబాబు ఎంపికయ్యాడు. త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకుడు.

Jagapathi Babu - మహేష్ మూవీకి విలన్ ఫిక్స్
X

జగపతిబాబు-మహేష్ బాబు.. వీళ్లది రేర్ కాంబినేషన్. జగపతి బాబు ఎన్ని విలన్ పాత్రలు చేసినప్పటికీ, మహేష్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మంచి పాత్రలతోనే కనిపించాడు. మరీ ముఖ్యంగా శ్రీమంతుడు సినిమాలో మహేష్ కు తండ్రిగా జగపతిబాబు సరిగ్గా సరిపోయాడు. వాళ్లిద్దరి కాంబోను అస్సలు మరిచిపోలేం.

ఇప్పుడు మరోసారి మహేష్-జగ్గూ భాయ్ కాంబో రిపీట్ అవుతోంది. అయితే ఈసారి మహేష్ కు ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు జగపతిబాబు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విలన్ గా జగపతిబాబును తీసుకున్నారు. అలా అని ఇదేదో యాక్షన్ సినిమా అని, మహేష్-జగ్గూ భాయ్ మధ్య భారీ ఫైట్లు లాంటివి ఉంటాయని అనుకోవద్దు.

ఇదొక సున్నితమైన ఫ్యామిలీ-లవ్ ఎంటర్ టైనర్. చిన్న చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. ఈ ఫ్యామిలీ కథలో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు జగపతిబాబు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

First Published:  13 Feb 2023 5:16 PM GMT
Next Story