Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy: అధికారిక ప్రకటన ఇది

Balakrishna Veera Simha Reddy: వీరసింహారెడ్డి నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. వారసుడికి పోటీగా వస్తున్నాడు వీరసింహారెడ్డి.

Veera Simha Reddy: అధికారిక ప్రకటన ఇది
X

సంక్రాంతి సినిమాలకు ఒక్కొక్కటిగా తేదీలు ప్రకటిస్తున్నారు. ముందుగా విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు సినిమాకు సంబంధించి తేదీ ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు బాలయ్య హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి తేదీ ఫిక్స్ చేశారు. వారసుడు వస్తున్న రోజునే, అంటే జనవరి 12నే బాలయ్య సినిమా కూడా వస్తోంది.

నిజానికి ఈ తేదీ అనధికారికంగా ఆల్రెడీ బయటకు వచ్చేసింది. ఈరోజు మేకర్స్, అధికారికంగా ప్రకటించారంతే. వాల్తేరు వీరయ్య తేదీ కూడా అన్-అఫిషియల్ గా బయటకు వచ్చేసింది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతోంది 'వీరసింహారెడ్డి'. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌ లో కనిపిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలని క్రియేట్ చేసింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ జై బాలయ్య యూట్యూబ్‌ లో పెద్ద హిట్.

విడుదల తేదీ ప్రకటించిన సందర్భంగా వీరసింహారెడ్డి నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ లో బాలకృష్ణ సీరియస్ లుక్‌ లో కనిపించారు. తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లు కనిపించిన బాలకృష్ణ లుక్ టెర్రిఫిక్ గా ఉంది.

సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఇది బాలకృష్ణకు పాజిటివ్ సెంటిమెంట్. పండగకు విడుదలైన బాలకృష్ణ అనేక సినిమాలు ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్‌ లు గా నిలిచాయి. ఇప్పుడు వీరసింహారెడ్డి వస్తోంది.

ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.




First Published:  3 Dec 2022 12:10 PM GMT
Next Story