Telugu Global
Cinema & Entertainment

పైలమ్ పాడుతున్న సుధీర్ బాబు

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హంట్. ఈ మూవీ నుంచి పైలం అనే మాస్ ఐటెం సాంగ్ ను రిలీజ్ చేశారు.

పైలమ్ పాడుతున్న సుధీర్ బాబు
X

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. మాఫియా నేపథ్యంలో రూపొందుతోన్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది.


తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. అది సూపర్ హిట్టయింది. ఇప్పుడు అదిరిపోయే మాస్ సాంగ్ రిలీజ్ చేశారు. 'పాపతో పైలం...' అనే ఈ పాటలో అప్సర రాణితో కలిసి జోష్ గా స్టెప్పులేశాడు హీరో సుధీర్ బాబు.


'పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్' అంటూ విడుదల చేసిన 'పాపతో పైలం...'లో సుధీర్ బాబుతో పాటు అప్సరా రాణి స్టెప్పులు వేశారు. 'క్రాక్', 'సీటీమార్' తర్వాత మరోసారి ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేసింది. ఇందులో సుధీర్ బాబు, అప్సరా రాణితో పాటు శ్రీకాంత్, భరత్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. జిబ్రాన్ సంగీతం అందించగా... మంగ్లీ, నకాష్ అజీజ్ ఆలపించారు.


ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. నిర్మాత ఆనంద ప్రసాద్, చాలా రిచ్ గా ఈ సాంగ్ ను తెరకెక్కించారు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో ఇదొక్కటే పాట. కథను డిస్టర్బ్ చేయకుండా, పక్కా స్క్రీన్ ప్లేతో వస్తోంది హంట్ మూవీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీకి విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తారు.



First Published:  11 Oct 2022 10:26 AM GMT
Next Story