Telugu Global
Cinema & Entertainment

Animal Movie | వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా?

Animal movie - యానిమల్ సినిమా సూపర్ హిట్టయింది. ఇంతకీ ఈ సినిమా వెయ్యి కోట్లు వసూలు చేస్తుందా?

Animal Movie | వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా?
X

సందీప్ రెడ్డి వంగా తీసిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. డంకీ, సాలార్ రాకముందు ఈ సినిమా ప్రభంజనం కొనసాగింది. ఆ రెండు సినిమాలు వచ్చిన తర్వాత యానిమల్ కు ఆక్యుపెన్సీ తగ్గింది. ఈ నేపథ్యంలో, ఓ అరుదైన రికార్డ్ ను ఇది అందుకుంటుందా అనే చర్చ మొదలైంది.

గడిచిన వారాంతం ఈ సినిమాకు ఇండియాలో రూ. 5 కోట్ల నెట్ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే, ఇండియాలో యానిమల్ వసూళ్లు రూ.538 కోట్ల కు పెరిగాయి. గ్రాస్ పరంగా చూసుకుంటే ఇండియాలో యానిమల్ సినిమాకు 650 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ లో 230 కోట్ల రూపాయలు వచ్చాయి. దీంతో ఈ సినిమా మొత్తం వసూళ్లు 880 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి.

మరికొన్ని రోజుల్లో ఈ సినిమా 900 కోట్ల రూపాయలకు చేరడం ఖాయం. అయితే ఇది వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరుతుందా అనేది ఇప్పుడు అందరి అనుమానం. ముందుగా ఈ సినిమా 900 కోట్లు కలెక్ట్ చేయాలంటే స్థిరంగా మరో వారం రోజులు ఆడాల్సి ఉంటుంది. అక్కడ్నుంచి వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరాలంటే, మరో 2 వారాల పాటు నిలకడగా తన ప్రదర్శన కొనసాగించాల్సి ఉంటుంది. ఓవైపు డంకీ, మరోవైపు సలార్ రాకతో.. యానిమల్ సినిమా 1000 కోట్ల వసూళ్లు సాధిస్తుందా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది.

ట్రేడ్ అంచనా ప్రకారం, ఈ సినిమా 900 కోట్ల మార్క్ దగ్గర ఆగిపోతుందని అంటున్నారు. సందీప్ వంగ డైరక్ట్ చేసిన ఈ సినిమా, రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

First Published:  26 Dec 2023 4:59 PM GMT
Next Story