Telugu Global
Cinema & Entertainment

Indranti | మరో సినిమా ప్రకటించిన ఇంద్రగంటి మోహనకృష్ణ

Indranti - లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమా ప్రకటించాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈసారి కూడా శివలెంక కృష్ణప్రసాదే నిర్మాత.

Indranti | మరో సినిమా ప్రకటించిన ఇంద్రగంటి మోహనకృష్ణ
X

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై మంచి చిత్రాలు అందించి తన అభిరుచి చాటుకున్నారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.‌ సమంతతో 'యశోద' సినిమా నిర్మించింది ఇతడే. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800'కి ప్రజెంటర్ కూడా ఈయనే.

ఇప్పుడీ నిర్మాత మరో మంచి సినిమా ఎనౌన్స్ చేశారు. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కొత్త సినిమా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో తొలి సినిమా నాని 'జెంటిల్ మన్'. బాక్సాఫీస్ విజయంతో పాటు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు, అదితీ‌ రావు హైదరీ జంటగా సూపర్ హిట్ సినిమా 'సమ్మోహనం' చేశారు.

ఇప్పుడు చేయబోయేది వాళ్ళిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా. ఇందులో ప్రియదర్శి హీరోగా నటించనున్నాడు. హీరోగా 'బలగం' సినిమాతో ఆయన భారీ విజయం అందుకున్నాడు. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

First Published:  2 March 2024 8:13 AM GMT
Next Story