Telugu Global
Cinema & Entertainment

Indian 2 | భారతీయుడు 2 వస్తున్నాడు

Indian 2 - జూన్ లో ఇండియన్-2 వస్తుందని ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు తేదీ దాదాపు ఖరారైంది.

Indian 2 | భారతీయుడు 2 వస్తున్నాడు
X

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమా ఇండియన్ 2. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని జూన్ 13న విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అలాగే ఈ నెల 15న భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారని సమాచారం.

డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్దార్థ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సముత్తరఖని విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

సూపర్ హిట్టయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు-2 వస్తోంది. మొదటి భాగంలో సేనాపతి పాత్ర విదేశాలకు వెళ్లిపోతుంది. దేశంలో అవినీతి పెరిగినప్పుడు మళ్లీ వస్తానని చెప్పిమరీ అదృశ్యమౌతుంది. ఆ పాత్ర తిరిగి ఇండియాలో అడుగుపెడుతుంది. అక్కడ్నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఈ సినిమా స్టోరీ.

First Published:  1 May 2024 8:45 AM GMT
Next Story