Telugu Global
Cinema & Entertainment

Indian 2 - మరోసారి విడుదల వాయిదా

Indian 2 - కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఇండియన్-2. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్టు వార్తలొస్తున్నాయి

Indian 2 - మరోసారి విడుదల వాయిదా
X

శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న సినిమా ఇండియన్-2. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. ఇప్పుడీ సినిమా మరోసారి వాయిదా పడింది.

లెక్కప్రకారం ఈ ఏడాదిలోనే ఇండియన్-2 విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ లో జాప్యం వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో సినిమాను వచ్చే ఏడాది పొంగల్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు

ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్స్ ప్రకారం చూసుకుంటే, ఇండియన్-2 పొంగల్ కు సిద్ధమవ్వడం కష్టం అనేది యూనిట్ మాట. నిజానికి ఈ సినిమాకు సంబంధించి ఇంకా 40 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది.

కాకపోతే, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కనీసం 6 నెలల టైమ్ కావాలి. మరీ ముఖ్యంగా కీలకమైన గ్రాఫిక్ వర్క్ పూర్తవ్వడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే పొంగల్ నుంచి సినిమాను తప్పించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు కుదిరితే, వచ్చే ఏడాది వేసవికి ఇండియన్-2 వస్తుంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు షూట్ చేసిన కొంత భాగాన్ని కమల్ హాసన్, రికార్డింగ్ స్టుడియోలో చూశారు. ఆ రషెష్ చూసిన కమల్, శంకర్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. అంతేకాదు, ఓ ఖరీదైన వాచీని కూడా ఆయనకు బహుమతిగా ఇచ్చాడు.

First Published:  29 Jun 2023 2:33 PM GMT
Next Story