Telugu Global
Cinema & Entertainment

మళ్లీ సెట్స్ పైకి ఇండియన్ 2

చాన్నాళ్లుగా ఆగిపోయిన ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలైంది.

మళ్లీ సెట్స్ పైకి ఇండియన్ 2
X

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ఇండియన్ 2 సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చింది. శంకర్ దర్శకత్వంలో ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఈ సందర్భంగా మరో బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేశారు.

సూపర్ హిట్టయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 ను తెరకెక్కిస్తున్నారు. రెండేళ్ల కిందటే షూటింగ్ మొదలైంది. అయితే అంతలోనే కరోనా రావడం, క్రేన్ కూలి సిబ్బంది మరణించడం లాంటి ఘటనల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత శంకర్ కు, లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలకు మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి.

దీంతో ఒక దశలో కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అన్ని సమస్యలు కొలిక్కి రావడంతో, ఇండియన్ 2 సినిమాను మళ్లీ మొదలుపెట్టేందుకు శంకర్ అంగీకరించాడు. ఈ మేరకు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాను పక్కనపెట్టి కమల్ మూవీ స్టార్ట్ చేశాడు.

ఈ సినిమా కోసం చెన్నై శివార్లలో భారీ సెట్ వేశారు. ఇవాళ్టి నుంచి ఆ సెట్స్ లోనే షూటింగ్ మొదలవుతుంది. కాజల్ ఇందులో హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఆమె కూడా సెట్స్ పైకి వస్తుంది. పెళ్లి, పిల్లల వల్ల గ్యాప్ తీసుకున్న కాజల్ కు ఇది రీఎంట్రీ మూవీ కాబోతోంది. సిద్దార్థ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు.





First Published:  24 Aug 2022 3:24 AM GMT
Next Story