Telugu Global
Cinema & Entertainment

G2 | గూఢచారికి విలన్ దొరికేశాడు

G2 Movie - గూఢచారి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు నటుడు ఇమ్రాన్ హష్మి. యూనిట్ అతడికి సాదరంగా స్వాగతం పలుకుతోంది.

G2 | గూఢచారికి విలన్ దొరికేశాడు
X

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పాడు. గూఢచారి సీక్వెల్-G2లో అడివి శేష్‌తో కలిసి నటించబోతున్నాడు. ఇమ్రాన్ రాకతో ఈ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీకి పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది.

టైగర్ 3లో ఇమ్రాన్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. ‌ఆ సినిమా చూసిన తర్వాత జీ2లో తీసుకోవాలని యూనిట్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

“జీ2 కోసం ఇమ్రాన్ హష్మీతో కలిసి నటిస్తున్నందుకు నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అతని ఎంట్రీ నిస్సందేహంగా మా సినిమాకు కొత్త కోణాన్ని ఆపాదిస్తుంది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు అడివి శేష్. అటు ఇమ్రాన్ హష్మీ కూడా జీ2 స్క్రిప్ట్ పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడు. స్పై థ్రిల్లర్ లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నాడు.

నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బనితా సంధును ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్టు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. గూఢచారి సినిమా ఎక్కడ ముగుస్తుందో, సరిగ్గా అక్కడే జీ2 మొదలవుతుంది.

First Published:  15 Feb 2024 4:47 PM GMT
Next Story