Telugu Global
Cinema & Entertainment

బొమ్మ బాగున్నా నిండని గల్లా పెట్టె

తాజాగా అల్లు శిరీష్ హీరోగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మంచి రివ్యూస్‌తో పాటు గుడ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్లు మాత్రం పెద్దగా రావడం లేదు.

బొమ్మ బాగున్నా నిండని గల్లా పెట్టె
X

ఓటీటీల ప్రభావం సినిమాలపై బాగా చూపిస్తోంది. సినిమాలు బాగుంటున్నా థియేటర్లలో కలెక్షన్లు రావడం లేదు. మంచి రివ్యూస్ వచ్చి కచ్చితంగా బాక్సాఫీస్ హిట్‌గా నిలుస్తుందని భావించిన సినిమాలు కూడా కలెక్షన్లు లేక వెలవెలబోతున్నాయి. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారా వంటి లార్జెన్ దెన్ లైఫ్ వంటి సినిమాలకు మాత్రమే కలెక్షన్లు వస్తున్నాయి. సాధారణ సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం లేదు. ఓటీటీలోకి వచ్చాక చూడొచ్చులే అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు.

తాజాగా అల్లు శిరీష్ హీరోగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మంచి రివ్యూస్ తో పాటు గుడ్ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్లు మాత్రం పెద్దగా రావడం లేదు. శిరీష్ గత హిట్ చిత్రం శ్రీరస్తు శుభమస్తు మొదటి వారాంతంలో రూ.9.9 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా..అదే హీరో నటించి ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఒక్క క్షణం సినిమాకు రూ.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఊర్వశివో రాక్షసివో సినిమాకు హిట్ టాక్ ఉన్నా తొలి వారాంతంలో రూ.3.75 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

శిరీష్ ప్లాప్ సినిమాకు వచ్చిన వసూళ్లలో సగం మాత్రమే ఊర్వశివో రాక్షసివో సినిమాకు వచ్చాయి. ఇక చిరంజీవి హీరోగా ఇటీవల గాడ్ ఫాదర్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు యునానిమస్‌గా హిట్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ పక్కా అని మొదట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే తొలి వారాంతంలో భారీ వసూళ్లు వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ఈ సినిమాలే కాదు ఇటీవల కాలంలో విడుదలై మంచి రివ్యూస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న స్వాతిముత్యం, కృష్ణ వ్రింద విహారి, ఓరి దేవుడా వంటి సినిమాలకు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు దక్కలేదు. మంచి టాక్ తెచ్చుకుని కూడా ఇవన్నీ ప్లాప్ చిత్రాలుగా మిగిలి నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.

First Published:  10 Nov 2022 5:31 AM GMT
Next Story