Telugu Global
Cinema & Entertainment

IMDb: 2022 టాప్-10 సినిమాలు ఇవే!

IMDb: ఈ ఏడాది ఇండియాలో బాగా పాపులర్ అయిన సినిమా ఏది? టాప్-10లో చోటు దక్కించుకున్న సినిమాలేవి? ఆ లిస్ట్ చూద్దాం..

IMDb: 2022 టాప్-10 సినిమాలు ఇవే!
X

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన IMDb సంస్థ, ఈ ఏడాది ఉత్తమ భారతీయ చిత్రాల జాబితాను వెల్లడించింది. జనవరి 1 నుంచి నవంబర్ 17 మధ్య కాలంలో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల లిస్ట్ తయారు చేసింది. ఈ లిస్ట్ తయారుచేసిన విధానాన్ని కూడా వెల్లడించింది సదరు కంపెనీ.

ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ వినియోగదారులున్నట్టు తెలిపిన IMDb, వాళ్లు వేసిన ఓట్లు, సదరు సినిమా పేజీని సందర్శించిన హిట్స్ ఆధారంగా టాప్-10 జాబితాను తయారుచేసినట్టు వెల్లడించింది. అలా తయారుచేసిన ఇండియన్ టాప్-10 మూవీస్ 2022లో ఆర్ఆర్ఆర్ సినిమా నంబర్ వన్ స్థానంలో నిలిచింది.

రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. పైగా రాజమౌళి లాంటి దర్శకుడు తీసిన సినిమా కావడంతో అంతా ఈ సినిమా కోసం సెర్చ్ చేశారు. రిలీజైన తర్వాత IMDbలో తమ స్పందన తెలియజేశారు. అలా అత్యథిక ఓట్లతో ఆర్ఆర్ఆర్ అగ్రస్థానంలో నిలిచింది.

2022లో పాపులర్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానంలో కశ్మీర్ ఫైల్స్ నిలిచింది. సంచలన విజయం సాధించిన ఈ సినిమా కోసం చాలామంది IMDb వినియోగదారులు వెదకడం కనిపించింది. ఇక లిస్ట్ లో మూడో స్థానంలో కేజీఎఫ్-2 నిలిచింది. 2022 సంవత్సరానికి సంబంధించి IMDb మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితా ఇలా ఉంది.

1. ఆర్ఆర్ఆర్

2. ది కశ్మీర్ ఫైల్స్

3. కేజీఎఫ్ ఛాప్టర్-2

4. విక్రమ్

5. కాంతార

6. రాకెట్రీ

7. మేజర్

8. సీతారామం

9. పొన్నియన్ సెల్వన్-1

10. 777 చార్లీ

First Published:  15 Dec 2022 3:22 AM GMT
Next Story