Telugu Global
Cinema & Entertainment

Prabhas | కల్కి సినిమాలో నేను ఒక్కడ్నే కమెడియన్

Prabhas - కల్కి సినిమాలో తన క్యారెక్టర్ పై స్పందించాడు ప్రభాస్. సినిమాలో తను మాత్రమే కామెడీ చేస్తానని అన్నాడు.

Prabhas | కల్కి సినిమాలో నేను ఒక్కడ్నే కమెడియన్
X

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోంది 'కల్కి 2898 ఏడీ' సినిమా. మొన్నటివరకు ప్రాజెక్టు-కె గా వ్యవహరించిన ఈ ప్రాజెక్టుకు తాజాగా 'కల్కి 2898 ఏడీ' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గ్లింప్స్ విడుదల సందర్భంగా పలు ఆసక్తికర ప్రకటనలు చేశాడు ప్రభాస్. ఈ సినిమాలో తనే కామెడీ చేస్తాననే విషయాన్ని బయటపెట్టాడు.

"కల్కి సినిమాలో నేను సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు కొన్ని అతీత శక్తులు ఉంటాయి. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కాస్త ఫన్నీగా కూడా ఉంటుంది. దర్శకుడు నాగి నా పాత్రకు చాలా బాగా డిజైన్ చేశాడు. మొత్తం సినిమాలో ఫన్నీ క్యారెక్టర్ నా ఒక్కడిదే. అలా కల్కి సినిమాలో కమెడియన్ నేనొక్కడ్నే."

ఇలా కల్కి సినిమాలో తన క్యారెక్టరైజేషన్ ను బయటపెట్టాడు ప్రభాస్. సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయని, మూవీ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే ప్రేక్షకుడు ఓ కొత్త లోకంలోకి వెళ్లిపోతాడని అంటున్నాడు ప్రభాస్.

వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా కనిపించబోతున్నాడు. మరో విలన్ గా రానా కూడా కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి వస్తోంది కల్కి.

First Published:  22 July 2023 6:51 AM GMT
Next Story