Telugu Global
Cinema & Entertainment

Sudheer Babu: హంట్ కు హాలీవుడ్ టచ్

Hunt Movie: సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా హంట్. ఈ సినిమాకు హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు వర్క్ చేస్తున్నారు.

Sudheer Babu: హంట్ కు హాలీవుడ్ టచ్
X

సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం.

'హంట్'లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని యూనిట్ చెబుతోంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. మూవీకి అవి హైలైట్ అవుతాయని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

హాలీవుడ్‌లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. అలాంటి సూపర్ కంపోజర్స్, హంట్ కు పనిచేయడం విశేషం.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ తో పాటు, 'పాపతో పైలం...' పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు.

First Published:  26 Nov 2022 9:53 AM GMT
Next Story