Telugu Global
Cinema & Entertainment

Hunt Movie: యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్

Hunt movie: సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హంట్. ఈ మూవీ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు

Hunt Movie: యాక్షన్ మేకింగ్ వీడియో రిలీజ్
X

సు ధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమా యాక్షన్ మేకింగ్ వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు.


హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో 'హంట్' సినిమాలో యాక్షన్ దృశ్యాలను తెరకెక్కించారని ఆ మేకింగ్ వీడియో చూస్తే తెలుస్తోంది. సుధీర్ బాబు, భరత్, యాక్షన్ టీమ్ పడిన కష్టం ఆ వీడియోలో కనిపించింది. డూప్స్, రోప్స్ వాడకుండా ప్రేక్షకులకు రియలిస్టిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం యూనిట్ చాలా శ్రమించింది. తమ కష్టాన్ని సుధీర్ బాబు బయటపెట్టాడు.


''హంట్' రెగ్యులర్ ఫార్ములాలో వెళ్ళే సినిమా కాదు. కథను నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాం. క్యాంపస్ యూనివర్స్ కాస్‌కేడ్స్ అని ఒక టీమ్ ఉంది. ఫ్రాన్స్‌లో ఉంటారు. వాళ్లను కొన్ని సంవత్సరాలుగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాను. చాలా కొత్తగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫైట్స్ చేస్తుంటారు. స్టంట్ పీపుల్ కూడా రోప్స్, బెడ్స్ వాడలేదు. సినిమాలో ఎక్కడా ఒక్క రోప్, బెడ్ వాడలేదు. మా కెమెరామెన్ ఉన్నా... ఫైట్స్ వరకు ఆ టీమ్ కెమెరామెన్ వర్క్ చేశారు. ఆయన కూడా ఫైటర్, స్టంట్ మన్. 'విక్రమ్'లో స్టంట్స్ షూట్ చేసేటప్పుడు బోల్ట్ అని కెమెరా కోసం మిషనరీ వాడారు. ఆ మిషనరీ లేకుండా అటువంటి ఎఫెక్ట్ కెమరామెన్ తీసుకొచ్చారు. దానికి చాలా స్కిల్స్ కావాలి."


ఈ సినిమాలో యాక్సిడెంట్ తర్వాత మెమరీ లాస్ అయిన వ్యక్తిగా నటించాడు సుధీర్ బాబు. సినిమా చూసే ప్రేక్షకులకు ఒక్కటే క్యారెక్టర్. కానీ, సుధీర్ బాబు వరకు డబుల్ రోల్ ఇది. మెమరీ లాస్ అవ్వడానికి ముందు, తర్వాత... అర్జున్ పాత్రలో డిఫరెన్స్ యాక్షన్ సీక్వెన్సుల్లో నటించాడు సుధీర్ బాబు.



First Published:  10 Jan 2023 7:07 AM GMT
Next Story