Telugu Global
Cinema & Entertainment

Hanu-Man | హనుమాన్ సినిమాకు భారీ ఓపెనింగ్స్

Hanuman Movie - తేజ సజ్జ హీరోగా నటించిన సినిమా హను-మాన్. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కు భారీ స్పందన వస్తోంది.

Hanu-Man | హనుమాన్ సినిమాకు భారీ ఓపెనింగ్స్
X

తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ ప్రీమియర్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ఈరోజు తెలిసొచ్చింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలకానున్న హనుమాన్ కు ప్రీమియర్స్ ప్లాన్‌ చేశారు. ఈ రోజు పరిమిత సంఖ్యలో బుకింగ్స్ తెరిచారు. క్షణాల్లో బుకింగ్స్ అయిపోయాయి. డిమాండ్ పెరగడంతో, టీమ్ నిరంతరం షోలను జోడిస్తోంది. ఎన్ని స్క్రీన్స్ పెంచుతుంటే, అన్ని బుకింగ్స్ క్లోజ్ అవుతున్నాయి.

వైజాగ్‌లో బృందం వాస్తవానికి 2-3 షోలను ప్లాన్ చేసింది, అయితే సినిమా హౌస్ ఫుల్‌లను నమోదు చేయడంతో, వైజాగ్ నగరంలో మొత్తం 7 ప్రీమియర్ షోలు యాడ్ చేశారు. హైదరాబాద్‌లో, జనవరి 11వ తేదీ సాయంత్రం షో కోసం సంధ్య థియేటర్ బుకింగ్‌లు తెరిచారు. 10 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ అయిపోయాయి. దీంతో మరిన్ని షోలు జోడించారు.

హనుమాన్ ప్రీమియర్ షోలకు విపరీతమైన డిమాండ్ రావటంతో.. హైదరాబాద్‌లో కీలకమైన శ్రీరాములు, భ్రమరాంబ, సాయిరామ్, రాజధాని డీలక్స్ లో కూడా ప్రీమియర్స్ ప్రారంభిస్తున్నారు. చూస్తుంటే, జనవరి 11న గుంటూరుకారంతో సమానంగా హనుమాన్ కు ప్రీమియర్స్ పడేలా ఉన్నాయి. 12వ తేదీన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలకాబోతున్న సంగతి తెలిసిందే.

తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, రాజ్‌దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ వంటి పలు భాషల్లో హనుమాన్ విడుదల కానుంది.

First Published:  9 Jan 2024 5:12 PM GMT
Next Story