Telugu Global
Cinema & Entertainment

WAR 2 | హృతిక్-ఎన్టీఆర్ సినిమా అప్ డేట్

Hritik WAR 2 - హృతిక్ రోషన్ హీరోగా వార్-2 ఈనెల నుంచే ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ త్వరలోనే జాయిన్ అవుతాడు.

WAR 2 | హృతిక్-ఎన్టీఆర్ సినిమా అప్ డేట్
X

ఫైటర్ చిత్రం విడుదలైన నెలలోనే స్టార్ హీరో హృతిక్ రోషన్ తన తదుపరి చిత్రం కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. జనవరి 25న విడుదలైన ఫైటర్ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈలోగా వార్-2 మొదలుపెట్టబోతున్నాడు హృతిక్. "బహుశా నాకు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదేమో" అని ప్రకటించుకున్నాడు హృతిక్.

2019లో విడుదలైన వార్ చిత్రంలో హృతిక్, ఏజెంట్ కబీర్ పాత్రలో అదరగొట్టాడు. ఆ మూవీ గురించి ఆడియన్స్ ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి నటించిన ఆ చిత్రం అంతలా ప్రభావం చూపింది. దీనితో వార్ 2పై ఆసక్తి పెరిగిపోయింది. వచ్చే వారమే వార్ 2 షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.

వార్ 2 లో ఈసారి హృతిక్ తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఈ స్పై యూనివర్స్ లో తారక్ భాగం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నాడు.

ఫస్ట్ షెడ్యూల్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ.. హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ ని 2 వారాల పాటు చిత్రీకరించబోతున్నాడు. గత రెండు వారాల నుంచి హృతిక్ వార్ 2 చిత్రం కోసం పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్ లో కష్టపడుతున్నాడు. ఆ సమయంలోనే హృతిక్ గాయపడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

First Published:  16 Feb 2024 5:18 PM GMT
Next Story