Telugu Global
Cinema & Entertainment

War 2 Movie release date | వార్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

War 2 Movie release date: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డిసెంబర్ లేదా జనవరిలో సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా యష్ రాజ్ ఫిలింస్ ప్రకటించింది.

వార్ -2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
X

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో హీరోగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. బ్రహ్మాస్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

వార్ -2 మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లేని సన్నివేశాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ చిత్రీకరించాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డిసెంబర్ లేదా జనవరిలో సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా యష్ రాజ్ ఫిలింస్ ప్రకటించింది. 2025 ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఆ రోజు గురువారం కాగా, ఇండిపెండెన్స్ డే కలుపుకొని సుదీర్ఘమైన నాలుగు రోజుల వీకెండ్ దొరకనుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. దేవర షూటింగ్ ముగిసిన తర్వాత వార్ -2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కూడా సమాంతరంగా మొదలు పెట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో బాలీవుడ్ లో కూడా భారీగా ఇమేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. భారీ చిత్రాలను నిర్మించే యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో ఎన్టీఆర్ తన డెబ్యూ మూవీ చేస్తుండడం, అందులో హృతిక్ రోషన్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. వార్ -2లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడనే లీక్ ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించే సినిమాల్లో హీరో పాత్ర కంటే విలన్ పాత్రే పవర్ ఫుల్ గా చూపిస్తుండడంతో ఎన్టీఆర్ ని కూడా అదే రేంజ్ లో చూపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

First Published:  29 Nov 2023 11:31 AM GMT
Next Story