Telugu Global
Cinema & Entertainment

Naresh Pavitra: నరేష్-పవిత్ర మొదటిసారి ఎలా కలిశారు?

Naresh-Pavitra: వీళ్లిద్దరి మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. త్వరలోనే వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే వీళ్లిద్దరూ మొదటిసారి ఎప్పుడు, ఎక్కడ కలిశారు?

Naresh Pavitra: నరేష్-పవిత్ర మొదటిసారి ఎలా కలిశారు?
X

తాజాగా తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు నరేష్-పవిత్ర. ఇద్దరూ కలిసి ఓ వీడియో ద్వారా తమ లవ్ మేటర్ బయటపెట్టారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని అందులో ప్రకటించారు.

రియల్ లైఫ్ లో ఇంత క్లోజ్ అయిన ఈ జంట, తొలిసారి ఎక్కడ కలుసుకుంది. వాళ్లకు ఎలా పరిచయం ఏర్పడింది? ఇలాంటి చాలా సందేహాలుంటాయి చాలామందికి. వీటిపై స్వయంగా నరేష్ స్పందించాడు.

హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాలో తొలిసారి నరేష్, పవిత్ర కలిసి నటించారట. ఆ సినిమాలో పవిత్రను గమనించే అవకాశం తనకు వచ్చిందని, షాట్ ఓకే అన్న వెంటనే తన సీట్లోకి వెళ్లి పుస్తకం చదువుకుంటోందని అన్నాడు నరేష్. అలా ఆమెతో మాట్లాడే అవకాశం రాలేదన్నాడు.

ఆ తర్వాత సమ్మోహనం షూటింగ్ టైమ్ లో మళ్లీ కలిశారు. ఈసారి మాత్రం పరిచయం పెంచుకున్నారు. వ్యక్తిగత సమస్యల్ని కూడా ఒకరితో ఒకరు చర్చించుకునేంత చనువు వచ్చిందంట. అలా తామిద్దరి మధ్య అనుబంధం ఏర్పడిందని నరేష్ వెల్లడించారు.

కొన్నాళ్లుగా వాళ్లు తమ మధ్య రిలేషన్ షిప్ ను బయటపెడుతూనే ఉన్నారు. దాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. తాజాగా తమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు.

Next Story