Telugu Global
Cinema & Entertainment

Saindhav Movie | సైంధవ్ ప్రయాణం అలా మొదలైంది

Saindhav Movie: వెంకటేష్ హీరోగా నటించిన సినిమా సైంధవ్. ఇంతకీ ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది. దర్శకుడు, వెంకీని ఎలా మెప్పించాడు?

Saindhav Movie | సైంధవ్ ప్రయాణం అలా మొదలైంది
X

Saindhav Movie | విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైలురాయిలాంటి 75వ చిత్రం సైంధవ్. శైలేష్ కొలను దర్శకుడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా కార్యరూపం దాల్చింది. దీని వెనక జరిగిన ఆసక్తికర విషయాల్ని బయటపెట్టాడు దర్శకుడు.

"హిట్ 2 విడుదలైన తర్వాత నిర్మాత వెంకట్, వెంకటేష్ ని కలవమని చెప్పారు. మొదట కలిసినప్పుడు అసలు సినిమా గురించి మాట్లాడలేదు. జనరల్ లైఫ్ గురించి సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. 2-3 మీటింగ్స్ లో మా మధ్య మంచి బాండ్ ఏర్పడింది. తర్వాత కలసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది కదా అని ఇద్దరికీ అనిపించింది. అప్పుడు నా దగ్గర ఉన్న కథల్లో సైంధవ్ ఐడియా చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఇది నా 75వ సినిమా అనిపిస్తోందని చెప్పారు. తర్వాత ఐడియాని డెవలప్ చేసి పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా చెప్పాను. కథ మొత్తం విని ఓ హాగ్ ఇచ్చి.. చేస్తున్నాం అన్నారు. ఆయన అనుభవాన్ని, ఫీడ్ బ్యాక్ ని జోడించి స్క్రిప్ట్ ని ఇంకా బెటర్ చేసిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం."

ఇలా సైంధవ్ వెనక జరిగిన విషయాన్ని బయటపెట్టాడు శైలేష్ కొలను. చిన్నప్పట్నుంచి తనకు కమల్ హాసన్ అంటే ఇష్టమని, సైంధవ్ సినిమా చేసిన తర్వాత వెంకీ అభిమానిగా మారిపోయానని చెప్పుకొచ్చాడు. ఎమోషనల్ సీన్స్ చేయడంలో వెంకటేష్ ను కొట్టే హీరో లేడని అన్నాడు. సంక్రాంతి కానుకగా 13న థియేటర్లలోకి వస్తోంది సైంధవ్.

First Published:  10 Jan 2024 3:19 PM GMT
Next Story