Telugu Global
Cinema & Entertainment

Trivikram: త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

Trivikram: త్రివిక్రమ్ ఓ సినిమా తీస్తున్నాడంటే ఇంటి సెట్ ఉండాల్సిందే. ఆ సెట్ లోనే చాలా పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది. మహేష్ మూవీకి కూడా అదే రిపీట్ అవుతోంది.

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే
X

త్రివిక్రమ్ సినిమా.. ఇంటి సెట్ ఉండాల్సిందే

త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడంటే అందులో భారీ సెట్స్ ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఓ సెట్ ప్రాపర్టీ మాత్రం మస్ట్ గా ఉంటుంది. అదే ఇంటి సెట్. భారీ ఇంటి సెట్ లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయడేమో అనిపిస్తోంది. అతడి గత సినిమాల్లో ఇలాంటి సెట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు తాజా చిత్రం కోసం కూడా ఇలాంటి సెట్ రెడీ అవుతోంది.

మహేష్ ను డైరక్ట్ చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ మూవీ కోసం 3 భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ఇందులో ఒకటి ఇంటి సెట్. ఈ సెట్ లోనే సినిమాకు సంబంధించి 40శాతం షూటింగ్ జరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు.

ఇక త్రివిక్రమ్ గత సినిమాల్లో ఇంటి సెట్స్ గురించి చెప్పుకుందాం..

అత్తారింటికి దారేది - ఈ సినిమాలో సునంద ఇంటి సెట్ వేశారు. సినిమాలో చాలా భాగం ఈ సెట్ లోనే జరిగింది.

సన్నాఫ్ సత్యమూర్తి - దేవరాజ్ హౌజ్ సెట్ వేశారు. సినిమాలో ఉపేంద్ర పోషించిన పాత్ర పేరు దేవరాజ్.

అ..ఆ: నితిన్ ఇంటి సెట్, సమంత ఇంటి సెట్. ఈ రెండు సెట్స్ లోనే సినిమా పూర్తయింది

అల వైకుంఠపురములో: వైకుంఠపురం సెట్. హీరో తల్లి, తండ్రి ఉండే సెట్. సెకండాఫ్ చాలా భాగం ఇందులోనే.

First Published:  9 Dec 2022 7:30 AM GMT
Next Story